క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (best books to read in life .TXT) 📕
Read free book «క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (best books to read in life .TXT) 📕» - read online or download for free at americanlibrarybooks.com
Read book online «క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (best books to read in life .TXT) 📕». Author - భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)
యశో ఇంకేమీ మాట్లాడలేదు. కళ్లు మూసుకుంది.
సరళ లోపలికెళ్లి కాఫీ తీసుకొచ్చింది. నెమ్మదిగా యశో కూడా త్రాగింది.
ఆ తరువాత, సరళా, రాజేంద్రా వెళ్లిపోయారు.
అప్పుడు యశో యెడల కలిగిన అనురాగంతో నా హృదయం కదిలింది.. దీనిని వెల్లడించటం ఎలా?
“అమ్మీ,” అన్నాను యశో పక్కకు చేరి.
‘‘మీరు అనవసరంగా కంగారు పడకండి. మీరు నాదగ్గర ఉంటే చాలు, నాకు కొండంతధైర్యం,” అంది యశో కళ్లు విప్పి నాకేసి చూస్తూ.
‘‘అది నువ్వు నాకు చెప్పాలా అమ్మీ,’’అన్నాను బలవంతాన కన్నీళ్లు ఆపుకుంటూ.
అప్పుడే రాజేంద్ర కొన్ని మందులు తీసుకుని వచ్చాడు. మూడు గంటల కొక మోతాదు వెయ్యమన్నాడు.
రాత్రి పది గంటలైంది. మందుల ప్రభావమేమో, అప్పటికే యశో చాలాసేపుగా నిద్ర పొతొంది. నేను తన పక్క దగ్గర కుర్చీలో కూర్చున్నాను. ఎప్పటిలాగే నా మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతున్నాయి.
అప్పుడు సుశీ మళ్లీ ఇప్పుడు యశో... సుశీకి జబ్బుగా వున్నప్పుడు ఆమె పక్కవద్ద ఇలాగే కూర్చునేవాడిని, అయినా ఆమెని రక్షించుకోలేక పోయాను. ఆమె నా చేతుల్లోంచి జారిపోయింది. ఆమె బదులు నాకు ఈ రత్నం లభించింది. ఈమెను నేను ఎన్నడూ పారవేసుకోను. ఆకాశం భూమైనా, మూడు ఆరైనా, ఆరు నూరైనా ఈమెను నేను రక్షించుకుంటాను. యశోకి నేను ఎప్పుడూ ఇసుమంతైనా సేవచేసి ఎరుగను. నా గురించి ఈమె ఎన్నో కష్టాలు పడింది. ఎంతో త్యాగం చేసింది. ఈసారి ఈ అవకాశాన్ని జారవిడువను.
అంతలో యశో మూలుగు వినబడింది.
“అమ్మీ” అని పలకరించేను, ఆమె దరి చేరి.
"అరే, మీరింకా పడుకోలేదా?’’ అని నెమ్మదిగా అంది యశో కళ్లు తెరవకుండానే
‘‘అవును అమ్మీ, నిన్ను చూ స్తూ కూర్చున్నాను,’’ అన్నాను.
యశో ఒక నవ్వు నవ్వి తిరిగి నిద్రాదేవత వడిలో చేరింది.
‘‘మీరింక వెళ్లి పడుకోండి రామంబాబు, నేను కూర్చుంటాను యశో దగ్గర,’’ సరళ వస్తూనే అంది.
‘‘అదేమిటి సరళా నువ్వెందుకు? నేనుంటాను, యశోకి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు, ఈసారైనా ఈ మాత్రం చేయనీ, ’’ అన్నాను.
‘‘మరి వేరే అవకాశాలు భవిష్యత్తులో మీకు చాలా కలుగుతాయి లెండి. ప్రస్తతం యశో మా అతిథి, స్నేహితురాలు, సోదరి. నాకిలాంటి అవకాశం మళ్లీ తిరిగి రాదు,’’ అంది.
మా మాటలతో యశోకి మెలకువ వచ్చింది.
‘‘సరళా నువ్వు వెళ్లి పడుకో, వీరున్నారుగా నన్ను కనిపెట్టుగుని,’’ అంది యశోమెల్లగా నవ్వూతూ.
యశో మాటలు నాకు ఎంత సంత్రుప్తినిచ్చాయో సరళను అంత నిరుత్సాహపరిచాయి.
సరళ ఏదో అనబోతూంటే, యశో ఆమెను తనమీదికిలాక్కుని, బుగ్గమీద ముద్దు పెట్టుకుని అంది. “ఇంకేమీ అనకు సరళా.”
“సరే”, అని సరళ వెళ్లిపోతూంటే, యశో అంది, ‘‘టైమయినట్టుంది, కాస్త మందిచ్చి వెళ్లు సరళా.’’
సరళ ముఖం కాస్త వికసించింది. ఎంతో అప్యాయంగా మందిచ్చి "గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్" అని, తలుపు జారేసి వెళ్లిపోయింది.
‘‘సరళా, రాజేంద్రలనను ఇబ్బంది పెడుతున్నానని నాకు బాధగా వుంది. మీరు కష్టపడుతున్నారని నాకు చింతగాలేదు, కృతజ్ఞత చూపించాలనే ఆలోచనా లేదు? ఇది మీ కర్తవ్యంలా అనిపిస్తూంది,’’ అంది యశో
‘‘అవును అమ్మీ. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. జీవితమంతా కూడా నేను నా విధిని పాటిం చేటట్టు చెయ్యి. భారమంతా నువ్వే మోస్తే నాకు బాధగా వుంటుంది,’’ అన్నాను.
మరికొద్ది సేపటి రాజేంద్ర వచ్చాడు.యశోని పరీక్షించి “రెస్పాన్స్ బాగుంది, ఇంప్రూవెమెంట్ ఉంది,” అన్నాడు, ఆ రూమ్ లో వేరే బెడ్ ఉన్నా నేను రాత్రల్లా కుర్చీమీదే కూర్చున్నాను. అప్పుడప్పుడు కునికిపాట్లు పడ్డాను. యశోని రెండుసార్లు లేపి మందిచ్చాను.
తెల్లవారకమునుపే యశో నిద్ర లేచేటప్పటికి నేను కుర్చీమీద జోగుతున్నాను.
“ఎలావుంది అమ్మీ నీకు,” అన్నాను మెళుకవ వచ్చి.
“నాకు బాగానే వుంది కానీ మీ వరసే ఏమీ బాగా లేదు, రాత్రంతా ఇలాగే ఉన్నారా?’’ అంది కోపమూ, మార్దవమూ మిళితమైన దృక్కులు ప్రసరిస్తూ.
“అబ్బేలేదు అమ్మీ, ఇప్పుడే కూర్చున్నాను ఇక్కడ,’’ అన్నాను.
‘‘ఎందుకలా పరగడుపునే అబద్దాలాడుతారు. ఆ పక్క చూస్తే తెలియదా, పడుకున్నదీ లేనిదీ? మీరిలా చేశారంటే అసలు మిమ్మల్ని ఈ గదిలోకి రానీయను, సరళను రమ్మంటాను,’’ అంది.
యశో ఎంత వద్దన్నా ఆ రాత్రి కూడా నేను తన గదిలోనే బెడ్ లైట్ వేసి వేరే పక్క మీద పడుకు న్నాను కానీ యశోకి ఏదైనా కావాల్సి వస్తుందేమో; నిద్రపట్టితే మెలకువ రాదేమోనన్న భయంతో చాలాసేపు నిద్ర పట్టలేదు. అయితే చివరికి ఎప్పటికో మగత నిద్ర పట్ట బోయింది, కానీ అంతలోనే తలుపు చప్పుడు విని గుమ్మం కేసి చూశాను. రాజేంద్ర తలుపు తోసి గదిలోకి తొంగి చూస్తూ కనబడ్డాడు. మొదట నాకు ఆశ్చర్యం వేసింది, తరువాత నాలో కుతూహలం చోటు చేసుకుంది, దాంతో నేను నిద్ర నటిస్తూ, ఆ మసక వెలుతురులో నా అరమోడ్పు కన్నులతో అతని ఆగడాలను వీక్షింపదలచేను. అతగాడు అక్కడినించే నా పక్క కేసి చూసి, దొంగలా గదిలోకి దూరి, నేరుగా యశో పక్కకు చేరేడు. అక్కడే చాలాసేపు మంత్ర ముగ్ధుడిలా ఆమె కేసి చూస్తూ నిలబడి పోయాడు. ఆఖరికి, నెమ్మదిగా యశో నుదిటిపై ఒక చెయ్యి వుంచి, రెండవ చేత్తో దుప్పటి సరిచేస్తుంటే ఆమెకు మెలుకువ వచ్చింది. కళ్లు తెరవ కుండానే, “ఎవరు? బాదల్ బాబు,” అంది. అప్పుడు, చడీ చప్పుడూ కాకుండా అతడు గబ గబా వెళ్లడం చూసి, నేను యశో మంచం దగ్గరకు వెళ్లి అన్నాను, ‘‘అవును అమ్మీ, నేనే.”
యశో నా చేతిని తన చేతుల్లోకి తీసుకుని మళ్ళీ నిద్రలో ఒదిగిపోయింది.
ఆ అద్భుత దృశ్యం నాకిప్పటికీ కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. మనసులోని మమతా, మమకారం మాసిపోవట మనేది ఎంత కష్టమో గ్రహించాను అప్పుడు. ఒక్కసారి ఒక వ్యక్తిని ప్రేమించటం తటస్థిస్తే దాని నుండి విముక్తవడం ఎంత అసంభవం, అవకాశం దొరికినప్పుడల్లా అది తల ఎత్తుతుంది. శరీరం ఎవరికి చెందినా ప్రేమ మనస్సులో నివసిస్తూనే వుంటుంది. అది రావణకాష్టంలాంటిది, ఆ అగ్ని ఎన్నటికీ ఆగిపోదు. ఆ మంట ఎన్నటికీ చల్లారలేదు.
మరుసటి రెండు రోజులు, పగలల్లా నేనూ సరళా యశో దగ్గర వుండే వాళ్లం, రాజేంద్ర గుమ్మం కూడా కదిలేవాడు కాదు. గంట రెండు గంటల కోసారి వచ్చి యశోని చూసేవాడు. ఎందుకైనా మంచిదని మరొకమారు ఆ డాక్టరుని పిలిపించాడు. అప్పుడతడు తన జీవితంలో వచ్చిన ఆ అవకాశాన్ని చేజారకుండా చూసుకోవా లన్నట్టు ప్రవర్తించేవాడు.
అయిదవ రోజుకు యశోకి జ్వరం పూర్తిగా తగ్గిపోయింది కానీ బాగా బలహీన పడింది. మరి అలాంటి స్థితిలో అమెని తీసుకుని తీర్థయాత్రలకు ఎలా వెళ్లగలను నేను. అయినా ఫర్వాలేదు పోదామంది. ఈసారి నేను అడ్డుపెట్టవలసి వచ్చింది. సరళ సంతోషానికి మేరలేదు. ఒకసారి ఎగిరి గంతువేసి యశో మెడను పట్టుకుని రెండు బుగ్గల మీదా ముద్దులు పెట్టుకుంది.
‘‘మీరు ఎంతకాలం వుంటే అంత సంతోషం మాకు రామంబాబూ. యశో చాలా నీరసంగా వుంది. నా శక్తి వంచన లేకుండా ఆమెకు నేను వైద్యం చేస్తాను. ఆమె మామూలుగా ఆరోగ్యవంతురాలయ్యేవరకూ మీరిక్కడే వుండిపోండి. ఇది చాలా ఆరోగ్యవంతమైన ప్రదేశం. ఆరోగ్యం కోసం అనేకమంది ఇక్కడకు వస్తూవుంటారు, మరి యశో ఏమిటో ఇక్కడనించి వెళ్లిపోతా నంటుంది!’’ అన్నాడు రాజేంద్ర.
జవాబు యశో నోటివెంట వచ్చింది.
‘‘మేమంటే మీకింత దయా, కరుణా ఎందుకు చెప్పిండి. బదులు తీర్చలేని దయ కూడా భరించటం కష్టంగా వుంటుంది రాజేంద్రబాబూ. మీ ఫీజు ఏమి ఇవ్వమంటారు?’’ అంది.
రాజేంద్ర నేత్రాల్లోంచి అవ్యక్తమైన బాధ క్షణమాత్రం గోచరించింది.
‘‘దీనిని దయా, కరుణా అని మమ్మల్ని కించపరచకు యశో, మీరు దగ్గరవుంటే మాకెంతో సంతోషంగా వుంటుంది. కేవలం స్వీయలాభం కోసం చేస్తున్నపని. మీరు ఇంకా కొన్నాళ్లు ఇక్కడ వుండటమే నాఫీజు,’’ అన్నాడు.
రాజేంద్ర ఎంత గంభీరుడో సుశిక్షితుడో నాకు తెలుసు. అవసరం వస్తేనే పెదవులు విప్పుతాడు. లేకపోతే తాళం వేస్తాడు. అటువంటి వ్యక్తి ఎంత బాధపడుతూ ఆ మాటలన్నాడో నేను గ్రహించాను. తనను యశో పరాయివానిగా చూస్తుందనీ, తన పూర్వ ప్రేమకు విలువ యేమీ ఇవ్వడం లేదని గ్రహించి బాధపడివుండాడు. కాని ఈ సమస్యకు పరిష్కారం ఏముంది? సుశీ మరణించక పోతే, యశోని నేను కలవక పోతే బహుశా, యశో రాజేంద్రను వివాహ మాడేది. కాని విధి ఇంకొక విధంగా తలచింది.
మరి ఇంకొక నాలుగు రోజలు గడచిపోయాయి. రాజేంద్ర ఏవేవో విటమిన్స్, టానిక్స్ తెచ్చి ఇచ్చేవాడు యశోకి బలం చేకూర్చడానికి . యశో భారమంతా సరళ వహించింది. యశో ముఖంలో పూర్వపు తళుకూ, బెళుకూ వచ్చాయి.
ఒకనాటి మధ్యాహ్నం నేను మా గదిలోకి వచ్చేటప్పటికి సరళ వీణ శ్రుతి సవరిస్తోంది. సరళ కంఠస్వరం బాగానే వుంటుంది కానీ తనకు వీణా సాంగత్యం కూడా వుందని నాకు తెలియదు.
‘‘రండి. మీ కోసమే యశో ఇదంతా బయటకు తీయించింది’’ అంది సరళ నన్ను చూసి
“ కర్మకాలి మీరు నన్ను పాడమనరు కదా?” అన్నాను నవ్వుతూ.
‘‘మీరేం దిగులుపడకండి, సరళ ఈ మధ్య వీణ వాయించటం నేర్చుకుందిట. అందుకే ఈ గాన కచేరి,’’ అంది యశో.
‘‘సరే, సరళ పాట కంటే ఇం కేం కావాలి,’’ అన్నాను
‘‘మీకు తెలియదా రామం బాబు, యశో చక్కగా పాడుతుంది,” అంది సరళ.
‘‘వారు నన్ను ఎప్పుడూ పాడమని అడగలేదు,’’ అంది యశో చిన్నబుచ్చకుంటునట్లు.
‘‘యశో అది తెలియక చేసిన పాపం. నువ్వు పాడగలవని తెలిస్తే చెవులు కోసుకు వినుండేవాడినని ఊహించలేవా,’’ అన్నాను నా రెండు చెవులు సాగదీసుగుని.
‘‘అయితే ఒక చెవితో వీణాస్వరం మరో చెవితో యశోగాత్రం వినండి,” అంది సరళ నవ్వూతూ.
‘‘మరీ మాటకారవుతున్నారే,” యశో నవ్వుతూ అని నా చెవులను నా చేతుల్నించి విడిపించింది.
"సహవాసం దోషం అనవు కదా యశో," అంది సరళ నవ్వుతూ.
"లేదు, యశోలాభం అనుకుంటాను," అంది యశో నాకేసి ఎంతో ఆప్యాయంగా చూస్తూ.
“ఏంటి సరళా, ఎప్పుడూలేనిది ఈ వేళ వీణ తీశావు,’’ అన్నాడు అప్పుడే వచ్చిన రాజేంద్ర.
‘‘నాకోసంకాదు రాజేంద్రా. యశో పాడతానంది’’
“ఆలస్యం ఎందుకు శుభస్య శీఘ్రం, ప్రారంభించు యశో,’’ అన్నాడు రాజేంద్ర.
రాజేంద్ర ముందు పాడటానికి యశో కాస్త సంశయించింది. ఆలస్యం చేస్తూంటే, సరళ తన చెవిలో ఏదో చెప్పింది. దాంతో యశో ముఖం లజ్జాపూరితమైంది.
సరళ వీణ వాయించటం ప్రారంభించింది. యశో పాట అందుకుంది. పాట సరిగ్గా జ్ఞప్తికి లేదు. ఏదో ‘ముద్దుల నవ్వుల మోహన కృష్ణా….’ అంటూ పాడినట్టు జ్ఞాపకం. యశో తలవంచుకుని పాడుతుంటే సరళ నాకేసి చూసి నవ్వుతూనే వుంది .
యశో కూనిరాగాల బట్టి తనంతచక్కగా పాడగలదని నేనెన్నడూ ఊహించలేదు. ఎంత విచిత్రంగా వుంది. అపార సౌందర్యము, సుగుణ సంపద, ప్రేమాభిమానాల తోటి మనస్సుని రంజింపచేసే ఈ శ్రవణానందకరమైన సంగీతశక్తి కూడా ఆమెకుందని తెలిసి నాకెంతో ఆనందం కలిగింది. బహుశా అది నాకు తనంతట తాను తెలియపరచటం ఇష్టం లేక మానివేసినట్టుంది. అయినా ఎప్పుడు నాగోలే కానీ నే నెప్పుడయినా తనగురించి పట్టించుకుంటే గదా తన్నుతప్పు పట్టడానికి. కొత్తగా నేర్చు కుంటున్నా సరళ కూడా వీణ బాగా వాయించింది. వీణ వాయించే ఆ భంగిమలో కూర్చుని తీగెలను మీటుతూంటే ఆమె ఎంతో మనోహరంగా వుంది.
పాటంతా అయిపోయిన వెంటనే రాజేంద్ర లేచి నుంచుని చప్పట్లు కొట్టగ నేనూ చేయూతనిచ్చాను
‘‘కంగ్రాచ్యులేషన్స్. చాలా బాగుంది యశో. నాకు కాస్త అర్జంటుపని వుంది. బయటికి వెళ్లాలి,’’ అని వెళ్లిపోయాడు.
ఆ మాటల్లో కాస్త ఆవేశం వుంది. ఆ పరిస్థితుల్లో తనను తను నమ్ముకోలేక వెళ్లిపోయాడని నాకర్ధమయింది. అతనికి పాట నచ్చటంలో ఆశ్చర్యమేముంది. ఎవరి పాటైనా బాగుంటే ఎవరైనా మరొక పాట పాడమంటారు. కాని అతను ఇంకొకటి పాడుతుందేమో నన్న భయంతో వెళ్లిపోయాడు. మానవుడు ఆవేశాలకి బానిస, వుత్సాహం అణచుకోవచ్చు కాని ఉద్రేకం అణచుకో లేము. యశో అదేమీ గుర్తించినట్టులేదు.
‘‘ఎలావుంది మీకు?’’ అంది.
‘‘యశో ఇన్నాళ్లు నీ గానామృతం రుచి నాకెందుకు చూపించలేదు,’’ అన్నాను.
‘‘నా వాయిద్యం మాటేమిటి రామంబాబూ,’’అంది సరళ ఆతృతగా
‘‘ఒక వెంపు నీ శృతి, యశో స్వరంతో మిళితమవుతుంటే, వేరో వెంపు నీ భంగిమే నీ లయతో పోటీ పడినట్లనిపించింది,” అన్నాను.
“యశోకి అభ్యంతరం లేకపోతే ఈ మీ అన్వయాన్ని జీవితాంతం పొందు పరచు కుంటాను,” అంది సరళ ఎనలేని ఆనందంతో.
“వారివల్ల నువ్వు పొందిన దానిపై నాకెందుకు అభ్యంతరం సరళా,” అంది యశో.
సరళ, యశోని తన హృదయానికి హద్దుకుని కళ్ళ వెంట నీళ్లు కార్చగా, నాకు అవి తుడవాలనిపపించిది కాని, నేను ఒక అడుగు కూడా ముందుకువెయ్యలేక పోయాను.
‘‘నాకు ఇంతవరకు ఎందుకు చెప్పలేదు యశో, నీది ఇంద మధురకంఠమని,’’ ఆ రాత్రి యశోని అడిగాను.
‘‘మీరు నన్ను అడుగలేదు, అనేక సార్లు చెప్పుదామనుకున్నాను కాని, సిగ్గూ, పౌరుషమూ అడ్డువచ్చేవి. అయినా, మీరు అప్పుడు చెవుల్లో సీసం పొసుగున్నారు కదా,’’ అంది తను సాలోచనగా.
"అంత నిష్టూరంగా మాట్లాడి నన్ను బాధపెట్టకు అమ్మీ," అన్నాను.
"మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, నాబాధ చెప్పుకోవాలనిపించింది, అయినా గతం నాస్తి," అంది యశో నాచెయ్యి తీసుగుని.
‘‘అయితే సంగీతం ఎప్పుడు నేర్చుకున్నావు?’’ అన్నాను.
‘‘మీరు ముస్సోరి ఒక సంవత్సరంలో వస్తారనగా మానేశాను. సంగీతపు మాస్టరు ఈ వూరువదిలి వెళ్లిపోయాడు’’ అంది.
‘‘గతం నాస్తి, ఇప్పుడొక జోలపాట పాడు,’’ అన్నాను.
‘‘నాకు జోలపాటలు రావు. కృష్ణుడిమీద పాటలే వచ్చు’’ అంది యశో నవ్వుతూ.
రాజేంద్ర వైద్యం వల్ల సరళ శ్రద్ధవల్లా యశో పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది. అపుడే అక్కడికి వచ్చి పక్షం రోజులైపోయాయి. ఇక ఎన్నాళ్లుంటాము. యశోకి చికిత్స చేయడంలో రాజేంద్ర మమత పునర్జీవించిందని గ్రహించాను. అలాంటి స్థితిలో ఇంకాఎక్కువ కాలం వుండటం ఎవరికీ మంచిదికాదు. నన్ను ఆశ్చర్యపరచిందేమంటే సరళ ఇది గ్రహించినా యశో దీనిని గుర్తించినట్లే కనబడలేదు. ఆమె ప్రేమించని పురుషుని ప్రేమను ఎంత నిర్దయగా తిరస్కరిస్తుంది. స్త్రీ? కనీసం సానుభూతి కనికరం అయినా చూపించదు.
ఆమాటకొస్తే, సరళ విషయంలో నేను మాత్రం ఏం తక్కువ తిన్నాను. ఆమె నాపై చూపుతున్న ఎడతెగని మక్కువను రాజేంద్ర గ్రహించ కుండా ఉంటాడా? చెప్పాలంటే రాజేంద్ర కిది డబల్ జెపార్డీ. మరి నా మాటకొస్తే, ఇద్దరు అందమైన యువతులు నన్ను కోరుకుంటున్నా, నేనెవరికీ కాకుండాపోతున్నాను కదా. మాలాంటి వ్యర్ధ ఫోర్సమ్ ప్రపంచంలో ఎక్క డైన్ వుంటారా?
ఎంత వెళ్లిపోతామని మొత్తుకున్నా సరళ, ‘‘ఇంకొక రోజు .. యింకొకరోజు,’’ అనేది.
రాజేంద్ర కూడా యశో ఇంకా మామూలు స్థితికి రాలేదు అనేవాడు. డాక్టర్ గా రాజేంద్ర మాటలకు ఎదురుచెప్పలేక ఇంకొక వారం గడిపేశాము. చివరికి ఒక రోజున చెప్పాము మరుసటి దినం మా ప్రయాణమని. ఇక కాదనలేక ఒప్పుకోలేక ఒప్పుకున్నారు ఆ దంపతులిద్దరూ.
యశోని తీసుకుని అక్కడికి ఇక్కడికి ఆ స్థితిలో తిరగటం ఇష్టం లేకపోయింది నాకు.. అందుకే ముందర కాశీ వెళ్లి అక్కడ కొంత కాలం వుందామని నిశ్చయించుకొన్నాము. రాజేంద్ర కూడా డాక్టరుగా అదే సబబన్నాడు అన్నాడు
అపోద్దున్న సరళ ముఖంలో, రాత్రి నిద్రపోయిన చిహ్నాలు ఎక్కడా కనబడ లేదు. అనుకున్నట్టుగానే రాజేంద్ర కార్ లో నలుగురం డెహ్రడూన్ రైల్వేస్టేషన్ కి బయలుదేరాం. దారిపొడుగునా యశో, సరళా ఏదో మాట్లాడుకుంటున్నారు. స్టేషన్ లోకి వెళ్లి మా సామాను ఒక స్లీపర్ కోచ్ లో సద్ది ఫ్లాటుఫాం మీద నించునివున్నాము. ఇం కా రైలు బయలుదేరటానికి పదినిమిషాలుంది.
“డాక్టరుగా మీ ఫీజు చెల్లించ కుండానే వెళిపోతున్నాము, రాజేంద్రబాబూ,” అంది యశో .
‘‘నువ్వు త్వరలో వచ్చి ఇవ్వచ్చులే యశో,’’ అన్నాడు రాజేంద్ర.
‘‘లఖియాకి నా నమస్కారాలు చెప్పు సరళా’’ అంది యశో రైలెక్కుతూ.
గార్డు పచ్చజెండా పడుతున్నాడు. రైలు కూసింది.
నేను కదులుతున్న రైలెక్కుతుంటే సరళ నా దగ్గరకు హఠాత్తుగా వచ్చి,
‘‘నాకు మనస్సులో అన్యాయం చేయకండి రామంబాబూ,’’ అంది ఆవేదనతో.
నేను జవాబిచ్చేలోగా రైలు కదిలింది. చెయ్యి మాత్రం ఊపాను.
చాప్టర్ 27
మరునాడు ఉదయాన్నే కాశీ చేరుకున్నాము. ఇల్లు దొరికేవరకూ ఏదైనా హోటల్లో వుందామన్నాను కాని యశో ఒక ఆంధ్ర ఆశ్రమం వైపు మొగ్గు చూపింది. త్వరలోనే గంగ ఒడ్డున ఒక మూడు గదుల ఇల్లు . కొనుక్కుని అందులోకి మకాంమార్చాము.
‘‘మనకి రెండు గదులు చాలు. ఒకటి వంటకి, మరొకటి పడకకి, మూడోది ఏం చేద్దాం చెప్పండి?’’ అంది యశో పాలు పొంగిస్తూ.
ఆప్రశ్న కి సమాధానము తన కెంత తెలుసో నాకూ అంతే తెలుసు.
ప్రతిరోజు సూర్యోదయవేళ మేమిద్దరం కలిసి గంగాస్నానం చేసే వాళ్ళం. వారానికొసారి సాయంకాలం బోటు మీద గంగపై విహరించేవాళ్లం. అన్నిటి కన్నా నాకు అదే నచ్చింది. అప్పుడప్పుడు ఒక రాత్రికి బోటు అద్దెకు తీసుకుని రాత్రంతా అందులోనే గడిపేవాళ్లం.
అన్నివేళలా మాయిద్దరి జీవన బాట ఒకటైనా, కాశీ విస్వేస్వరుడి కొలువులో మాత్రం మాది వేరే దారి.
యశో ఆ దైవం ఎదుట అరమోడ్పు కన్నులతో తన్మయిస్తే నేను తనను పరవసిస్తూ చూసే వాడిని.
‘‘దేముడి నుంచీ నీవు ఏమి కోరుకుంటావు అమ్మీ,’’ అని అడిగాను ఒకసారి.
‘‘మీ కంటే ముందు నన్ను తనదరి చేర్చుకోమని,’’ అంది పూజ చేసిన పుష్పాల్లో ఒకటి జడలో తురుముకొంటూ.
“ప్రాపంచక విషయాల్లో లేని స్వార్ధం, ఆధ్యాత్మిక బాటలో ఎందుకు యశో?" అన్నాను.
యశో జవాబివ్వలేదు, బహుశా నా ప్రశ్నకు ఆమె సమాధానం వెదుక్కుంటోందేమో.
యశోకి చెప్పకుండా అదే రోజు మధ్యాన్నం నేను ఒక వంగపండు రంగు బనారస్ సిల్క్ చీర
కొనుక్కొచ్చాను.
"నచ్చిందా అమ్మీ?" అన్నాను చీర కొంగు విప్పిచూపిస్తూ.
"చాల బాగుంది, అమ్మవారికని కొన్నారా ఇంతలో ఎంత భక్తి పుట్టుకొచ్చింది మీకు," ఆ చీర తీసుకుని నవ్వుతూ అంది .
"అమ్మవారికి కాదు అమ్మీ, నా దేవత కోసం," అన్నాను.
ఆ చీర పట్టుగుని సంతోషంగా మా మూడో గదిలోకెళ్లి, దానిలో సంతృప్తితో వచ్చి నాకు కనుల పండగ చేసింది.
"ఆశీర్వదించండి," అంది నాకు పాదాభివందనం చేస్తూ.
"ఏమని?" అన్నాను తన తలమీద నా చెయ్యి ఉంచి.
"మీకు తోచినది," అంది తల పైకెత్తి నా కళ్ళలోకి చూస్తూ..
"సదా సుఖీభవ," అన్నాను.
"నా ట్రాప్ లో పడ్డారు," అంది లేచి నవ్వుతూ.
"అదేం మాట అమ్మీ," అన్నాను.
"అంటే ఇంక నన్నెప్పుడు కష్టపెట్టరనేగా మీ ఆశీర్వాద అంతరార్దం," అంది.
"నిన్నుసుఖపెట్టలేక పోతున్నానన్న భాధ నన్నెప్పుడూ వేధిస్తూంది అమ్మీ," అన్నాను.
"ఉపశమనానికి మీకెప్పుడూ నా చీర చెంగు ఉందిగా," అని యశో ఆ చీర కొంగుని నామెడకు చుట్టింది.
"అయితే, ఎడ్లబండిలో నీది బూటకపు నిద్రన్నమాట," అన్నాను దాన్ని బిగించుకోబోతూ.
తన చీర కొంగు లాక్కుని నవ్వుకుంటూ యశో వంటిట్లోకి వెళ్ళిపోయింది.
కొంత కాలానికి యశో బలవంతం మీద తీర్ధయాత్రలకు బయలుదేరాము.
మామొదటి మజిలీ ప్రయాగరాజ్ లో ఆదిలోనే హంన్సపాదన్నట్లయింది.
ఆనాడు త్రివేణిలో స్నానానికి బయలుదేరాము. గంగా, యమున కలుసుకునే సంగమ స్థానం ఒడ్డుకి కొంచెం దూరంలోవుంది. అక్కడకు వెళ్లాం. అక్కడ కొన్ని కొన్ని చోట్ల ఎర్రటి జండాలు ఎగురుతున్న పడవలున్నాయి. అవి బాగా లోతైన స్థలాలు. అక్కడ ఎవరూ స్నానం చేయకూడదు. నాకు కొంచెం ఈత వచ్చును. దానిని ప్రదర్శించడానికి ప్రయత్నం చేసేను, దానిలో చిక్కుకున్నాను. ఇంకేముంది కాళ్లకు నేల అందటం లేదు. చిన్న సుడిగుండముకూడా వున్నట్టుంది. అందులో గిర్రున తిరుగుతున్నాను. యశో అది చూసి గట్టిగా పిలిచింది. ‘బాదల్ బాబూ ఇంక బయటకు రండి’. ఆమె కేక వినబడింది, కాని బదులు పలక లేక పోయాను. చేతులు ఊపడం మొదలుపెట్టాను. యశో పరిస్థితి గ్రహించి గస్తీ పోలీసుల దృష్టి నాకర్షించడం చూశాను. తర్వాత స్పృహ తప్పింది.
మళ్లీ మెలకువ వచ్చేసరికి ఆస్పత్రిలో వున్నాను. శరీరంలో ఎంతో నీరసంగా వుంది. కాస్త తలనొప్పికూడా వుంది. నా మంచం దగ్గర కుర్చీలో యశో కూర్చుని, కిటికీలోంచి బయటకు పరధ్యానంగా చూస్తోంది. తెల్లటి బుగ్గల మీద కన్నీటి చారలు స్పష్టంగా కనబడుతున్నాయి..
‘‘అమ్మీ.’’ అని నెమ్మదిగా పిలిచాను.
యశో ఉలిక్కిపడి నా వైపు తిరిగింది. మరుక్షణంలో తన ముఖాన్ని చేతుల్లో దాచుకుని ఏడవటం మొదలు పెట్టింది. లేవడానికి ప్రయత్నించాను. దానితో తలనొప్పి మరీ ఎక్కువయింది. ‘అబ్బా’ అని తిరిగి పడుకున్నాను.
‘‘లేవకండి; మీకు ఇంకా స్వస్థత చిక్కలేదు,” అంది.
‘‘అసలు జరిగిందేదో చెప్పు యశో’’ అన్నాను నీరసంగా.
‘‘నన్ను ఎంత భయపెట్టారు మీరు? మీ గురించి నేను ఎంత యాతన పడ్డాను. తలచుకుంటే గుండె అవిసిపోతూంది. అనుక్షణం మిమ్మల్ని నేను ఎక్కడ చూడగలను చెప్పండి. ఈనాడు మిమ్మల్ని భగవంతుడు రక్షించకపోతే నా గతి ఏమగును?’’ అంది చీరచెంగుతో కళ్లు తుడుచుకుంటూ.
“నన్ను రక్షించింది నువ్వు అమ్మీ. భగవంతుడు కాదు. నాకు ఆ దేవుడి అవసరం లేదు. ఒక విధంగా ఆ స్థానాన్ని నీవే ఆక్రమిస్తున్నావు. ఈ మాటు నా ప్రాణం కూడా నీదై పోయింది. ఇక నా వద్ద మిగిలింది ఏమీలేదు,” అన్నాను.
‘‘నేను మిగిలాను బాదల్ బాబూ. ఏమి పోయినా నా సర్వస్వమూ మీదే. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయనని నాకు మాటివ్వండి. జీవితంలో ఎప్పుడూ ఈ రోజు భయపడినంతగా నేను భయపడలేదు. అచేతనమైన మీ శరీరాన్ని చూస్తుంటే గుండెలలసిపోయాయి. ఏడుస్తూ ఈ ఆస్పత్రికి తీసుకువచ్చాను,’’ అంది యశో పక్కమీదకు వచ్చి కూర్చుని.
‘‘ఈ నాటి నుంచీ నేను నీ మాట జవదాటను అమ్మీ,’’ అన్నాను తన చేతిని నాచేతిలోకి ప్రమాణ పరంగా తీసుగుని.
జరిగిన సంగతి తర్వాత తెలిసింది. పోలీసులు నన్ను బయటికి తీసేటప్పటికి బాగా నీరు తాగి వున్నాను. అలాంటి స్థితిలో యశో పరిస్థితి ఎంత హృదయ విదాకరంగా వుండి వుంటుంది. ఎంత క్షోభపడి వుంటుంది. ఒంటరి స్త్రీ, నిస్సహాయురాలు నూతన ప్రదేశం, పడవలో సృహలేని నా శరీరాన్ని దగ్గరపెట్టుకుని, ఆమె ఎంత దుఃఖించి వుంటుంది.
ఏడుస్తూ పోలీసులనర్ధించిందిట, ‘‘ఈయనని ఆస్పత్రికి తీసుకువెళ్లండి, మీ మేలు ఎన్నటికి మరచిపోను’’.
వాళ్లు పడవలోనే ప్రధమ చికిత్స చేసి ఈ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
తడిబట్టలతో ఆస్పత్రికి చేరేక తను విలపిస్తూవచ్చి డాక్టరుతో అందిట, ‘‘డాక్టర్ గారూ నాకు పతిభిక్ష పెట్టండి. ఈయనని రక్షించండి.’’
‘‘ఏమిఫర్వాలేదమ్మా త్వరలోనే నయమవుతుంది,’’ అన్నారుట ఆ డాక్టరు.
ఆస్పత్రిలో నాలుగు రోజులున్నాను. యశో నన్ను కంటికి రెప్పలా కాచుకుంది. తర్వాత ఇంకా వారం రోజులు కదలకుండా పడుకోవాల్సి వచ్చింది. తరువాత ఉత్తరాది క్షేత్రాలన్నీ తిరగడం ప్రారంభించాము - హరిద్వార్, రుషికేష్, బృందావనం, కురుక్షేత్రం, నాసిక్.
యశోనన్ను
Comments (0)