American library books » Fiction » క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (best books to read in life .TXT) 📕

Read book online «క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (best books to read in life .TXT) 📕».   Author   -   భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa)



1 ... 9 10 11 12 13 14 15 16 17 18
Go to page:
క్షోభ కలిగించిందో నేను గ్రహించాను.  

 అప్పుడు నాకు యశోని ఓదార్చాలనే భావం కలిగి    తన పక్కకు చేరి నెమ్మదిగా ‘యశో’ అని తన తల నావైపు తిప్పుకున్నాను.  ఆప్యాయతగా నేను తన బుగ్గల మీద తన కన్నీటిని తుడుస్తుంటే,  నా   చెయ్యి  తీసుగున ఆప్యాయంగా నోక్కింది.

‘‘టెలిగ్రాం  ఇచ్చిరండి. ఈ రాత్రే బయల్దేరుదాం,’’ అంది యశో ఆవేదనతో.

 

  

చాప్టర్ 30

 

 

ఆ మరునాడు డూన్ చేరుకునే టప్పటికి మధ్యాహ్నం మూడు గంటలయింది. స్టేషనుకు రాజేంద్ర సరళ వచ్చారు. దాయి వాళ్ల బాబుని ఎత్తుకుని వచ్చింది. పిల్లవాడు చాలా ఆరోగ్యంగా వున్నాడు. తల్లి పోలికలే వచ్చాయి వాడికి ముఖ్యంగా ఆ కళ్లు ముమ్మూర్తులా సరళవే. నేను ఎత్తుకునేటప్పటికీ ఏడుపు లంకించుకున్నాడు.

‘‘మీకు పిల్లల్ని ఎత్తుకోవటం బొత్తిగా చేతకాదు, అన్నింటితో పాటు,’’ అని యశో, బుల్లి రామంబాబుని  నాచేతుల్లోంచి తీసుకుంది.

యశో వద్ద కూడా ఊరుకోలేదు వాడు. తల్లికేసిఉర్ర్ల్ చాచగా కొడుకుని తనదగ్గరకు తీసుకుంది సరళ. 

‘‘నీక్కూడా పిల్లల్ని లాలించటం చేతకాదు యశో. అయినా పిల్లలు ఇంట్లోలేందే ఎలా చేతనవుతుంది. అందుచేత ....’’ అవి సరళ నవ్వుతూ ఆగిపోయింది.

‘‘ఎందుకులేరు సరళా? వీరులేరా, పది మంది పిల్లల పెట్టు,.’’ అంది యశో కూడా నవ్వుతూ.

నాకు కాస్త కోపం వచ్చింది. నా మనస్సంతా లఖియా మీద లగ్నమైంది. అలాంటి సమయంలో ఈ పరాచకాలేమిటి?

‘‘అయితే ఇక పదండి ఆలస్యమవుతుంది. ఇంటికి వెళ్లి సామాను పడేసి వెళ్దామా లేక తిన్నగా లఖియా వద్దకు వెళ్దామా చెప్పండి రామంబాబూ,’’అన్నాడు రాజేంద్ర నా భావాల్ని గ్రహించినట్లు.

‘‘తిన్నగానే వెళ్దాం రాజేంద్రబాబూ. మళ్లీ ఇంటికి వెళ్లి తిరిగి రావటం ఎందుకు?’’ అన్నాను.

మేమందరం, బుల్లి బాబు, దాయిలతో సహా,  రాజేంద్ర కారులో బయలుదేరాము. దారిలో చాలాసేపటి వరకు మౌనంగానే ఉన్నాము. కాసేపటికి యశో సరళ ఏదో రహస్యాలు చెప్పుకుంటున్నారు. ఇప్పటివరకు నా గురించి చెప్పటానికి ఎవరూ దొరకలేదు. ఎంతో కాలం పోయిన తర్వాత ఈ సరళ లభించింది. తీర్థయాత్ర విశేషాలు చెబుతూందని గ్రహించాను.

మేము  డూన్ జైలు చేరేక సరళ  తన కొడుకుని దాయితో వదలి, ఫార్మాలిటీస్ అన్నీ పూర్తిచేసిన పిదప  మమల్ని లోపలికి తీసుకెళ్లింది.

అదే ఖైదీలను కలుసుకోనిచ్చే గది.. అప్పుడా గదిలో ఇద్దరున్నారు - ఒక  స్త్రీ ఒక పురు షుడు. ఆ స్త్రీ ఒక కుర్చీమీద కూర్చునివుంది. పురుషుడు ఆమె కాళ్లమీద పడి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు. ఆమె శిలా ప్రతిమలా వుంది. చేతనారహితంగా కళ్లలోంచి నీరు కారటంలేదు. తిన్నగా గోడకేసి రెప్పవాల్చకుండా చూస్తూంది. ఇంతలో లోపలినుంచి పోలీసు వచ్చి లాఠీతో తలుపుమీద మూడు దెబ్బలు కొట్టాడు. ఆ స్త్రీ హఠాత్తుగా లేచినించుంది. ఆమె లేచినా పురుషుడు అలాగే కింద కూర్చున్నాడు ఏడుస్తూ. ఒక్కమాటైనా మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది ఆ స్త్రీ.  కాసేపు పోయినతర్వాత అతను కూడా వెళ్లిపోయాడు. అలాగే ఏడుస్తూ...

ఇదంతా మేము గుమ్మంవద్ద నుంచి చూస్తున్నాము. వీరిద్దరి మధ్యవున్న నిగూఢ రహస్యం ఏమిటి? నేరం చేసింది స్త్రీ అని స్పష్టంగా తెలుస్తూంది. అయితే అతను ఎందుకు అలా ఏడుస్తున్నాడు? ఆమె హృద‌యంలో దయా, దాక్షిణ్యం, కరుణ, కన్నీరు ఇవన్నీ ఎగిరి పోయాయా? ఇంకొక విషయం ఏమిటంటే స్త్రీ ఇంకా ప్రౌఢ వయస్సులోనే వున్నట్టుంది. చూడటానికి ఇప్పుడు ఏమంత బాగులేదు కాని ఒకప్పుడు అందంగా వుండివుండాలి. పురుషుడు యవ్వనం వదిలి చాలా కాలం అయినట్లు కనబడుతూంది. వీరిద్దరి మధ్యా సంబంధమేమై వుంటుంది. భార్యభర్తలా? అన్నా చెల్లెలా? తండ్రి కూతురులా? మూడవది అయివుండదు. మొదటి రెండిటిలో ఏదైనా కావచ్చు. లేకపోతే యే అన్యాయం చేసిన పరదేశీయో ఈ పురుషుడు. తప్పు తెలుసుకున్నాక క్షమాభిక్ష వేడుకుంటున్నాడేమో, అయితే ఈమెలో క్షమాగుణం కూడా అడుగంటి పోయిందా?

మేము లోపలికి వచ్చి అక్కడ ఒక బల్లమీద కూర్చున్నాను. లఖియా చాలా లోపలి నుంచీ రావాలి. అందుకు కాస్త ఆలస్యమవుతుందని చెప్పింది సరళ. ఆ కాస్తసేపు కొన్ని యుగాల్లా గడిచాయి. నేను పరధ్యానంగా కిటికీలోంచి బయటకు చూస్తూన్నాను. ఎవరో వస్తున్న చప్పుడైనట్లు వినబడి నా ద్రుష్టి గుమ్మంవైపు మరల్చేటప్పటికి అక్కడ లఖియా నిలబడివుంది,  మాసిన తెల్లటి చీరలో పాత దుప్పటి కప్పుకుని తలమీదకు లాక్కుని. ముఖంలో ఆ అందం అలాగేవుంది. కాని కళ్లలోంచి ఏదో మాయమైనట్టనిపించింది నాకు. నాకప్పుడదేమిటో  సరిగ్గా  తట్టలేదు. బహుశా నిశ్చలతయేమో.

యశోని నన్ను  చూసి లఖియా క్షణకాలం ఆశ్చర్యపోయింది. తన శక్తినంతా వినియోగించి ఒక చిరునవ్వు నవ్వింది. ఆ మందహాసానికి నేను తట్టుకోలేకపోయాను. ఒకసారి ఆమె కాళ్లమీదపడి ఇందాకా ఆ పురుషుడు ఏడ్చినట్టు ఏడవాలనిపించింది. ఏకాంతంగా వుంటే బహుశా అలాగే చేసేవాడినేమో. అలా అయితేనా హృద‌యంలోని భారం తీరును. వీరందరి ఎదుటా నేనలా చేయలేను.

‘‘ఎప్పుడు వచ్చారు మీరు యశో, చాలాకాలమైంది. మిమ్మల్ని చూసి’’ అంది లఖియా.

మరుక్షణంలో యశో లఖియా పాదాల మీద పడిపోయింది. లఖియా ఆమెను పట్టుకుని హృద‌యానికి హత్తుకుంది. కొన్ని క్షణాలు అలాగే గడిచాయి.

‘ఇప్పుడే వచ్చాం, సరళ ద్వారా  నిన్ననే తెలుసుకున్నాం,’ అంది యశో నెమ్మదిగా లఖియాని వదలి.

‘‘రామంబాబూ, మళ్లీ కలుసుకోమేమోనని భయపడ్డారుకదూ చూడండి ఎంత త్వరలో కలుసుకున్నామో,’’ అంది లఖియా నాకేసి చూసి నవ్వుతూ.

కాసేపు నేనేమీ సమాధానం చెప్పలేదు. ఆ సమయంలో ఏమనాలో తెలియడంలేదు.

‘‘రెండు సంవత్సరాలు లఖియా,’’ అప్రయత్నంగా అని, ‘‘ఈలోపున చనిపోయినా బాగుండేది,’’ అన్నాను హృద‌యంలోని ఆవేదన భరించలేక

లఖియా ముఖం క్షణకాలం మేఘావ్రుతమైంది.

‘‘అలాంటి మాటలు ఎప్పుడూ అనకండి రామంబాబూ. యశోకు ఎంత బాధ కలుగుతుందో గ్రహించలేరా?  నాకూ  కష్టంగా వుంటుంది,’’ అంది.

అవును నిజమే, ఆవేశాలను అణచుకోవాలి. లఖియాని చూడటానికి వచ్చింది ఆమెకు కాస్త సంతోషం చేకూరుద్దామని ఆమెని కష్టపెట్టడానికి కాదు.

‘‘ఏనాడూ నీ కష్టకాలంలో ఆదుకోలేకపోయాను, ఈనాడైనా నాకా అవకాశమియ్యి లఖియా,’’ అన్నాను.

‘‘మీకు నేనిచ్చిన మాట మరచిపోలేదు రామంబాబూ. కాని ఇందులో ఇతరుల సహాయం వల్ల జరిగేదేమీ లేదు. ఎవరి చేష్టల ఫలితం వారనుభవించాల్సిందే,”

“అదంతా సరే, నాదొక కోరిక  తీరుస్తావా?’’ అన్నాను.

‘‘చెప్పండి, నేనే చేయగలదవుతే చేస్తాను. కానీ వాగ్దానం చేయలేను,’’ అంది.

‘‘నిన్ను ఇక్కడ నుంచి విడిపించి మాతో తీసుకుపోతాము. శేషజీవితమంతానువ్వు మాతోనే గడపాలి,’’ అన్నాను.

మనస్ఫూర్తిగా కోరుకున్న కోరికది. అంతకుముందు దీనిని గురించి ఆలోచించలేదు, అలాంటి ఆలోచన తట్టినందుకు నాకు ఎంతో ఆనందం కలిగింది.

‘‘ఈ కోరికను తోసిపుచ్చకు లఖియా అంతకంటె వారినీ, నన్నూ సంతోషపరిచేదింకేమీ లేదు. నా కోసం కాకపోయినా, వారికోసమైనా, అవుననూ లఖియా,’’ అంది యశో కూడా వెంటనే.

లఖియా ఇంకా ఏమీ మాట్లాడలేదు. నెమ్మదిగా వెళ్లి కూర్చీలో కూర్చుంది.

‘‘ఆనాటి నీ జీవితంలో దుఃఖపునాదులు అంతరించిపోయాయి లఖియా జీవితంలో పూర్తిగా కష్టాలే అనుభవించావు నీవు. ఈనాటితో వాటికి స్వస్తి చెప్పాలి. నిన్ను మా కులదైవంగా చూసుకుంటాము,’’ అన్నాను ఆమె మనస్సు మారిపోతుందేమోనన్న భయంతో.

లఖియా ఎంతో బలవంతాన కన్నీరు ఆపుకుంటూంది. క్షణకాలం క్రింది పెదిమ వణికింది.

‘‘అలాంటి మాటలనకండి రామంబాబూ. మీరూ, యశో, సరళా ఈ దీనురాలిమీద చూపుతున్న   దయకూ ఎప్పుడూ  అంతులేదు. ఇప్పుడు రాజేంద్ర బాబు నాపట్ల చూపుతున్నఆదరణకు నేనెంతో ఋణపడున్నాను. మీరందరిని భగవంతుడు కాపాడుతాడు, తన నుంచి నేను కోరుకునే అంతిమ కోరిక ఇదే. మీకు కష్టాన్ని కలిగించటం నాకు ఇష్టం కాదు. అయినా మీరన్నది చాలా అసమంజసము. జీవితంలో మనకు అనేక మంది తటస్థపడుతూంటారు. వారిలో కొంత మంది సన్నిహితులవుతారు; కొంత మందిని ప్రేమిస్తాము; చివరికి ఎక్కడో అక్కడ ఎవరి దారిని వారు పోవాలి. ఇది భగవత్ నిర్ణీతమైంది. దీనికి మీరూ, నేనూ ఏమీ చేయలేము,’’ అంది లఖియా.

ఈ మాటలంటూంటే సరళ నా కళ్లల్లోకి చూసింది. ఇదే మాటలు నేనొకసారి ఆమెకు చెప్పాను. మమ్మల్ని వదిలిపెట్టలేక మమతతో బాధ పడుతూంటే ఆమెకు సహన శక్తి ఇవ్వటానికి చేసిన ప్రయత్నం మది, ఈనాడు భగవంతుడు పగబట్టి ఈ అనాధ స్త్రీని రక్షించుకోవటానికి ప్రయత్నిస్తూంటే అవే మాటలు లఖియా వెంట వచ్చాయి.

‘‘అలాంటి మాటలన్నావంటే మళ్లీ ఎప్పుడూ ఇక్కడికి రాము లఖియా,’’ అంది సరళక కోపంగా.

‘‘అన్నీ మన ఇష్టప్రకారమే జరగవు సరళా? కారాగారవాసం కోరుకుంటే వస్తుందా? అయినా ఇదేమంత చెడు ప్రదేశం కాదు. శ్రీ కృష్ణుని జన్మస్థానం ఇదే,’’ అంది లఖియా నీరసంగా నవ్వుతూ.

లఖియా తన దుఃఖాన్ని దిగ మింగడమే కాక ఇతరుల ఇబ్బందులను పసిగడుతుంది 

‘‘నన్ను మీరు క్షమించాలి రాజేంద్రబాబూ; రామంబాబూ, యశో మాటలలోపడి మిమ్మల్ని కించపరిచాను’’ అంది లఖియా అప్పుడు అతనితో

‘‘అలా అనుకోకు లఖియా,’’ అన్నాడు రాజేంద్ర.

 అప్పుడే లోపల్నుంచి పోలీసు వచ్చి తలుపు మీద లాఠీ కొట్టాడు, ఇరవై నిమిషాలు గడువైపోయింది. లఖియా ఇంక తిరిగి పనిలోకి వెళ్లిపోవాలి.

 ‘‘నువ్వు ఏకాకివికావని గుర్తుంచుకో. నీ ఆలోచనా పర్యవసానం గ్రహించుకో. మళ్ళీ వచ్చికలుస్తా,’’ అంది  యశో.

‘‘నేనే అఘాయిత్యం చేయనులే యశో,  అయినా నా గురించి ఆలోచించి, ఆలోచించి మీ మనస్సు పాడుచేకోకండి. ముఖ్యంగా మీరు రామంబాబూ. నా గురించి మీరేమీ చింతించకండి.,’’ అంది లఖియా.

పోలీసువాడు మళ్లీ తలుపుమీద కొట్టాడు. లఖియా లేచి నించుని గుమ్మంవైపు నడిచిపోతూ అంది, ‘‘సరళా. బాబు కులాసాగా వున్నాడా?’’

జవాబు కోసం క్షణకాలం గుమ్మం వద్ద ఆగింది లఖియా.

సరళ గబగబా ఆమె వద్దకు వెళ్లి బుగ్గమీద నెమ్మదిగా ముద్దుపెట్టుకుంది.

‘కులాసాగానే వున్నాడు లఖియా, మళ్లీసారి తీసుకొస్తా,” అంది సరళ.

లఖియా గుమ్మం వద్ద ఆగినఒక్కక్షణం కూడా వృధా చెయ్యబుద్ధి కాలేదు.

లఖియా గుమ్మం దాటింది. లోపలికి వెళ్లేదారి ఒక పొడుగాటి బాట. పొడుగైన వరండాలోంచి పోవాలి. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ నడిచిపోతూంది. ఆమె పక్కన భుజానికి తుపాకీ తగిలించుకుని పోలీసువాడు నడుస్తున్నాడు. ఆ దృశ్యం నా హృద‌యంలో హత్తుకు పోయింది. లఖియా పారిపోకుండా చూడటానికి వాడు ఆమె ఛాయలా ఫాలో అవుతున్నాడు. ఆ ఆలోచన వచ్చిన వెంటనే నా రక్తం వుడికింది. మానవత్వానికే ఒక మాయని మచ్చ. భూకంపం వచ్చి ఆ జైలంతా పడిపోయినా, అక్కడి వారంతా చనిపోయినా ఆమె అక్కడ నుంచి  కదలదు. సీతా దేవిలాగ భూదేవి ఈమెను కూడా తన ఆలింగనంతో ఇమడ్చుకోవాలి. ఆమె అంతుకి అంతకంటే మార్గం లేదు.

అంతా రెప్పవాల్చకుండా నడచిపోతూన్న ఖైదీని చూస్తున్నాం. కొంత దూరం నడచి మలుపు తిరిగి మాయమైంది. ఆమె అడుగుల్లో తొట్రుపాటులేదు. మా అందరి కళ్లెదుట ఆ ద్రుశ్యం అంతరించి పోయింది. ఒకసారైనా వెనుదిరిగి చూస్తుందేమోనని ఆశించాము. మలుపు దగ్గిర క్షణకాలం ఆగినట్టనిపించింది. కాని వెనుదిరక్కుండానే ముందుకు సాగిపోయింది. వెనుదిరగటమనేది ఆమె స్వభావానికే విరుద్దమని నేను ఆనాడు గ్రహించాను. కష్టాలు తండోపతండాలుగావచ్చి మీదపడినా ఈ ఆబల చెక్కుచెదరదు. కన్నీరు కార్చదు. ఇంత జరిగినా ఆమెకు భగవంతుని మీద విశ్వాసం అచంచలంగా వుంది. తన కష్టాలకు కారకుడైన అతగాడినే కొలుస్తూంది. లఖియానుంచి నేను నేర్చుకున్నది ఒక్కటేవుంది. అదేమిటంటే జీవితంలో ప్రతి మానవుడు దేనినో దానిని విశ్వసించాలి. అది ఏదైనా కావచ్చు. దైవమే అయివుండనక్కర్లేదు. తల్లిగర్భంలోంచి జన్మించినప్పటి నుంచీ చనిపోయేవరకూ నేనే నాస్తికుడిని అని చెప్పగలిగిన వారెంతమంది వున్నారు. సరళకు భగవంతునితో నిమిత్తం లేదు. అతగాడంటే భయంతో ఆమె ఏపనీ చెయ్యదు. తనకు తోచినట్లు తాను చేస్తుంది. అది అక్షరాలా నిజం. ఏదో ఒక సమయంలో ప్రతి మానవుడు దైవాన్ని ప్రార్థిస్తాడు. తను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయే సమయంలో కన్నీరు కారుస్తూ చేతులు జోడిస్తాడు. తన ప్రార్థన మాత్రంతో వారిని తను రక్షించుకోలేదు. అయినా అలా చేస్తాడు.

బరువైన హృద‌యాలతో మేము వెనుదిరిగాము, బయటకు వస్తూంటే యశో ఒక చేత్తో నా చెయ్యి, ఇంకొక చేత్తో సరళ చెయి పట్టుకుంది. సరళ తన రెండో చెత్తో రాజేంద్ర చేయి పట్టుకుంది. నలుగురుమూ కారువైపు నడిచాము, దాయి వడిలో బాబు సుఖంగా నిద్ర పోతున్నాడు.

 

 

చాప్టర్ 31

 

 

 రాజేంద్ర కారు నడుపుతున్నాడు. నేనతని పక్కన కూచున్నాను. 

 సరళ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని  కొద్దిగా ఇరుకుగా యశో దాయి లతో వెనకాల సీట్లో కూర్చుంది.

ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరమూ పేదవి విప్పలేదు,పెద్దల మూడ్ గ్రహించేడో ఏమిటోచడి చప్పుడు లేకుండా బాబు నిద్రపోతున్న పోతున్నాడు

లఖియా నా యాచన తిరస్కరించింది. శిక్షాకాలం ఏదో విధంగా గడిచిపోతుంది. ఆ సత్ప్రవర్తన వల్ల అది తగ్గించబడవచ్చుకూడా. ఆ తర్వాత ఆమె మా వద్దకు వస్తుంది. ఇహపరాలను లక్ష్యం చేయకుండా ఆమెను సుఖపెడతాను. జీవితమంతా చీకటిమయం కాదని నిరూపిస్తాను. ఈదారిలో ఎన్ని ఆటంకాలున్నా లెక్కచెయ్యను, అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ లఖియా మాటలతో వమ్ములయ్యాయి. ఈమె ఇంకా ఎన్ని కష్టాలు పడాలని రాసివుందో. లఖియాని ధనసహాయం స్వీకరించమని అర్థించగలిగే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరి వద్ద నుంచీ ఏమీ స్వీకరించదు అనుకున్నాను.

చివరికి ఇంటికి చేరేము.                                     

"అయితే లఖియాకు మనము ఏవిధంగానూ సహాయ పడలేమా రాజేంద్ర," అన్నాను కారుదిగుతూ.

"అంటారుగా, తనని తాను హెల్ప్ చేసుగున్న వాళ్ళకే  దేముడు సహాయం చేస్తాడని, కానీ  లఖియా తన కర్మకు తన్ని వదిలేయమని మొండికేసి  కూర్చుంది. అయినా సాయంత్రం లాయర్ని మీరు కూడా కలుద్దురుగాని,' అన్నాడు తను దిగులుగా.

"ఒకవేళ  లాయర్గార్కి మీరు కుటుంబ వైద్యులయితే  ఆయన ఇక్క్కడికి వస్తారేమో అడగండి, మా అడ సలహాలు కూడాఉచితంగా పొందవచ్చు, ఏమంటావు సరళా,“అంది యశో నవ్వుతూ.

"సరిగ్గా  చెప్పేవు యశో అలాగే చేద్దాం,” .అన్నాడు రాజేంద్ర ఫోన్  దగ్గరకు వెడుతూ.

యశో నేను స్నానాలు చేసి వచ్చేటప్పడి కి  డైనింగ్ టేబుల్ మీదున్న దిల్ బహదూర్ వేడి వేడి భోజనం

ఆహ్వానం పలికితే రాజేంద్ర  వెల్కమ్ న్యూస్  తో  రెడీగాఉన్నాడు.  భోజనం చేశాక కాసేపు కునుకు తీసి అందరం  లాయర్గారి రాక కెదురుచూస్తూ కూచున్నాము.

కార్లోంచి దిగిన  రవిప్రకాష్ని రాజేంద్ర మాకు పరిచయం చేసాడు.

”మీట్ ద లైవ్ వైర్ లాయర్,’ అన్నాడు రాజేంద్ర. 

"హియర్ ద లైట్నింగ్ స్ట్రయిక్స్," అన్నాడు యశోని రవిప్రకాష్కి పరిచయం చేస్తూ.  

“'హూఇజ్ స్ట్రక్,"  అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ .

"బాదల్ బాబు యాని రామంబాబు," అంది సరళ నన్ను చూపిస్తూ.

“అరే, మోస్ట్  ఎలిజిబుల్ బ్రహ్మచారి అన్న విషయం చెప్పడం మరిచాను," అన్నాడు రాజేంద్ర

"అయితే పెళ్ళిచూపులేమైనా ఏర్పాటు చేయకూడదూ," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ.

"మన్మధుడు తలస్తే అవే అవుతాయి, ఏం చెప్పగలం," అంది సరళ నవ్వుతూ.

"మీ కంపెనీ ఎంజాయ్ చేయడానికి వేరో మారు వస్తానుకాని ఇప్పుడు అనుకోకుండా ‘రిట్’ కేసు తగిలింది,"  అన్నాడు రవిప్రకాష్ .

"మంచిదేగా మరి. వీళ్లూ మాలాగే ఆమెకి శ్రేయోభిలాషులు. వీరికా  లఖియా కేసు కాస్త బ్రీఫ్  చేస్తారా," అన్నాడు రాజేంద్ర.

"ఆ కేసులో విశేషమేమిటంటే అందులో అసలు కేసే లేదు. నిన్ననే ప్రభుత్వ ప్లీడర్ చెప్పేడు, ఆ దొంగ సన్నాసిని ఆస్పత్రినించి డిస్చార్జి చేశారని,"  అన్నాడు రవిప్రకాష్ 

"అయితే  ఇప్పుడు లాఖియాను విడిచిపెడతారా?" అన్నాను నేను ఆతృతగా.

"విడిచిపెట్టరు, విడిపించాలి, అందుకు నాకు ఆవిడ వకాలత్  కావాలి," అన్నాడు రవిప్రకాష్. 

"నేనిప్పిస్తా," అన్నాను ఆవేశంగా.                 

"అది అంత సులువయిన పనికాదు," అన్నాడు రవిప్రకాష్ నాకేసి ఆశ్చర్యంగా చూస్తూ.

"అలాగ ఎందుకనుకుంటున్నారు రవిప్రకాశ్ గారు," అన్నాను, ఆశ్చర్య పడడం నాఒంతవగా. 

"లాఖియాదొక మానసిక ఋగ్మత," అన్నాడ రవిప్రకాష్.                       

"మీరేమంటున్నారు!"అన్నాను అసహనంగా.

"డాక్టర్గా రాజేంద్ర అడ్వకేట్గా నేను అప్పుడప్పుడు లఖియాలాని కలుస్తూవుంటాము. మానసికశాస్త్ర రీత్యా వీళ్ళు 'విక్టిమ్స్ అఫ్ మార్టైర్ సిండ్రోమ్'. తామే త్యాగమూర్తులమని భావిస్తూ వీళ్ళు, వాళ్ళ కష్టాల్లోనే సుఖానుభూతి పొందుతారు పరుల సానుభూతితో . వాళ్లని వారి వారి మిధ్యాలోకంవీడి  నిజ జీవితం లోకి అడుగుపెట్టించడం బహుశా బ్రహ్మతరంకూడా కాదు," అన్నాడు రవిప్రకాష్ .

రాజేంద్ర తో సహా అందరం నిస్చేస్థితులమయ్యాము. 

"ప్రేమకు తరంకాని దేమీ కాదిది. నేను ప్రాణం పణంగా పెట్టయినా లఖియాని ఒప్పిస్తాను," అన్నాను ఆవేశంగా.

"మీకా నమ్మకముంటే తప్పక ప్రయత్నించండి," అన్నాడు రవిప్రకాష్  ఆశ్చర్యపడుతూ.

"ఒకవేళ ఆయన లఖియాను ఒప్పిస్తే మీరు ఆమెను విడిపించగలరా?" అంది యశో.

"అది నా ఎడమచేతి పని అనుకోండి," అన్నాడు రవిప్రకాష్  ధీమాగా.

"అదెలా?"  అంది యశో నమ్మ శక్యంకానట్లు.                                                                                       

"గాయపరిచింది ఆత్మరక్షణలో గనుక ప్రైమా ఫేసీ నేరంకాదని, అందునా బాధితుడు కోలుకున్నాడు గనుక  ఆమెకు మొదటి హియరింగ్ లోనే బెయిల్ ఇప్పిస్తాను. ఆ తరువాత గురువుగారి మీద మానభంగం కేసు నమోదుచేసిప్లేటుఫిరాయించి కధ అడ్డం తిప్పుతాను. అప్పుడు ఆ సన్నాసి'దొంగ' తీగ లాగితే అన్ని ఆశ్రమాల

'డొంక' కదుల్తన్న భయంతో వాళ్ళ'లాబి'ప్రభుత్వ  పప్లీడర్ని'చూసు' కుంటుంది. ఆ తర్వాత కధ కంచికి

లఖియా మీ ఇంటికి," ఆనాడు  రవిప్రకాష్ .

"అయితే ఎప్పుడు సుముహూర్తం ?" అంది సరళ.

"రేపైతే కుదరదు ఎళ్ళుండి పెట్టుకుందాం," అన్నాడు రవిప్రకాష్ .

"మరైతే పరీక్షకు తయారవ్వండి రామం బాబు," అంది సరళ.

"నీ నోట్స్ సాహాయంతో," అన్నానునేను

"ఎలాగూ చీటీ లందించడానికి నేనుంటానుగా," అంది యశో నవ్వుతూ.

"సరే, ఈలోగా వార్డెన్అనుమతి  పత్రం ఆమెవకాలత్నామావగైరా  సిద్ధం చేస్తాను," అన్నాడు  రవిప్రకాష్

చేతి వాచీ చూసుకుని.

"ఇంతకీ బెయిల్ ఎప్పుడు ఇప్పించ గలరు?" అంది యశో.

"అంతా  సవ్యంగా జరిగితే రెండు మూడు నెలల్లో.ఆతర్వాత ఆమె మీద కేసుకంచికి ఆమె మీఇంటికి ,"   అన్నాడు రవిప్రకాష్ .

"అల్లాగే అయితే మీ ఫీజు రెండింతలు," అంది యశో.

"డబ్బేమీ చెదు కాదు కానీ ఎందుకది!" అన్నాడు రవిప్రకాష్ .

"లఖియా రెండు నిండు ప్రేమలకు జీవంపోసినందుకు," అంది యశో.

"ఆమె మీదున్న మీ అందరి  అభిమానంతో నా భాద్యత పెంచారు," అన్నాడు రవిప్రకాష్ .  

"కాస్త వుండండి ప్రకాశ్గారూ,  ఐప్పుడే వస్తా," అనిచెప్పి యశో ఆలా వెళ్ళి ఇలా తిరిగివచ్చింది.

"దేనికంత తొందరేమిటండీ," అన్నాడు రవిప్రకాష్ యశో అందించిన కవరు అందుకుంటూ.

రాజేంద్ర,నేను రవిప్రకాష్ని సాగనంపింతరువాత, రాజేంద్ర తన క్లినికి వెళ్లగా నేనుతిరిగి ఇంట్లోకి వెళ్లేను.

"యశో ఏమిటీ నమ్మకం," అంటోంది సరళ.

"ఆయన మీద భరోసా," అంది యశో నన్ను చూపిస్తూ.     

"యశో మీమీద చాల భారం మోపింది రామం బాబూ," అంది సరళ.

"లఖియా భగవంతుడి మీద ఆంటే సరి," అన్నాను.

"మా భలేవాడ్నే నమ్ముకుంటున్నారు," అంది తానునవ్వుతూ.

ఒప్పందం మేరకు  రవిప్రకాష్ తన కారులో యశోని నన్ను డోన్ జైలు కి తీసుకెళ్ళేడు. దారిపొడుగునా తాను నెగ్గిన కేసుల గురించి చెపుతుంటే యశో నేను శ్రద్ధగా విన్నాము. అతడు సమర్ధవంతుడే  నన్న భావన యశో తన కళ్ళతో  వ్యక్తపరి చేది. 

జైలు కెళ్ళింతరువాత నేను లాఖియాను కలువదానికి వెడుతుంటే యశో ఎంతో ఆశతో పంపించింది,

కాని పట్టుమని పది నిముషాలైనా తిరక్కుండానే  తిరిగొస్తున్న నన్ను చూసిన  తన ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.

కానీ హుటాహుటిగా నేను వారిని చేరి,  లాయరుగారి  కోసం ‘లఖియా వేచివుంది’ అన్నప్పుడు ఆమె ముఖారవిందం వర్ణనాతీతం.

"చెప్పండి," అంది గోమూగా యశో, రవిప్రకాష్ హుషారుగా వెళ్ళింతరువాత.

"ఉత్తినే చెప్పను," అన్నాను.

"అయితే గట్టిగా అరవండి," అండి నన్ను దూరంగా తోస్తూ.

అప్పుడు యశోని దగ్గరకి తీసుగుని లఖియాతో 'నా మాటకి మాట' చెప్పేను.

"లఖియా నేను ఆత్మహత్య చేసుకుంటే యశో వ్యధ ఊహించలేవా," అన్నాను.

"మహాపాతకం రామంబాబు," అంది చెవులు గట్టిగా మూసుకుని.

"నన్నునమ్ము, నువ్వు నీధర్మం వీడితే  నేను నీకదే అంట గడతాను," అన్నాను.

"రామంబాబు, అసలు మీకు నోరెలావచ్చింది నాకు అధర్మప్రవర్తన ఆపాదించడానికి?" అంది కళ్ళలోంచి బటబట నీరుకారుతుంటే.

"ధర్మాధర్మాలు నిర్ణయించవల్సింది న్యాయమూర్తులు, నిందితులుకాదు, దానికి నీ విరుద్ధ వ్యవహారమే నీ అధర్మం. తప్పుపట్టనంటే, అహంకారం," అన్నాను.

"నే నహంకారినా, ఏమంటున్నారు రామం బాబు, మీరు," ఏడుస్తూ అంది.

"నీ అంత సుగుణమూర్తి, త్యాగశీలి వేరే లేదనుకోవటమే నీఅహంకారం," అన్నాను.

"ఏమిటి నా ధర్మం?" అంది మరుక్షణం.

"నీ కృత్యం లోని ధర్మాధర్మ నిర్ణయం న్యాయమూర్తికి విదలడమే నీధర్మం. అయినా  రణధీర్ మీద  'నీ వైధవ్యాన్ని కాపాడిన' కృతజ్ఞతా భావాన్ని గౌరవిస్తాను. నువ్వే  చేశావన్న అసత్య వచనానికి ధర్మోపాయం, అశ్వద్ధామ హతః కుంజరః," అన్నాను.

"రామం బాబు, నా కళ్ళు తెరిపించేరు, కృతఙయురాలిని," అంది నాచేయి పట్టుగుని.

"నీ కిప్పుడు దారి చూపించటానికి లాయర్ రవిప్రకాష్ గార్ని తోడుతెచ్చింది యశో, ఆయన్ని కలుస్తావా?" అన్నాను.

“యశోని కూడా," అంది.

"లాయర్ని కలిసేక, సరేనా," అంటే, లఖియా తలూపింది.

ఆ 'నా మాటకి మాట' విన్న యశో, ఆనందసంభ్రమాలలో ములిగిపోయింది

"ఇంక' నాకేమి చేతకాదు అమ్మీ'  పాట కట్టండి," అంది యశో తన చెక్కిలిమీద కారే ఆనందభాష్పాలు తుడుచుకుంటూ.

"ఇది నా స్వయం ప్రభావం కాదుఅమ్మీ, అంతా నీ సాంగత్య ఫలం," అన్నాను నేనూ ఆమె అనుభూతిని పంచుకుంటూ.

"సరళ కి ఫోన్ చేసి చెప్తేసరి," అంది.

"సరి కాదు బేసి, సరళ  ఆనందం ఫోన్ లో మనం కళ్లారా చూ డలేంగా?"  అన్నాను. 

"నిజంగానే నాకు మతిపోయినట్లుంది," అంది నవ్వుతూ.                   

"నీకే కాదు సరళక్కూడా, లేకపోతే  తన కొడుక్కి నాపేరు పెట్టడం ఏమిటి, రాజేంద్ర ఏమనుకున్నాడో ఏమో," అన్నాను.

"దీన్నే కందకి లేని దురద అంటారు," అంది సాలోచితంగా. 

ఆతరువాత రవిప్రకాష్ రాకకు మేము మౌనంగా  ఎదురు చూసాం.

మాకు క్షణ క్షణం ఒక యుగంలా గడుస్తూండగా, ఆఖరికి రవిప్రకాష్ మాకు థమ్స్అప్ సూచిస్తూ కనబడ్డాడు అతను ఇంకా  మా దగ్గరకు రాకుండానే యశో ఆనందంగా లాఖియాని కలవడానికి పరుగుతీసింది.

యశో తిరిగివచ్చేలోపల రవిప్రకాష్,  తను లఖియా దగ్గర సేకరించిన విషయాలు చెప్పి నన్నడిగాడు.

"అయినా ఏం మాయమాటలు చెప్పి ఆమె మనసు మా ర్చగలిగేరు?" 

"చెప్పడానికి  అవేమి మీ కచేరి వాదనలను బలపరచేవి కావు," అన్నాను నవ్వుతూ.

"ఎదో అనుకున్నానుకాని గట్టివారే మీరు," అన్నాడు చేయి కలుపుతూ.  

యశో  వచ్చిన  తరువాత నేను లఖియా ఏమంది అని అడిగితే తనంది, "మౌనమే మా ఆనందం."  

"మీ టిట్ కి మీ ఆవిడ టాట్ బాగుంది," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ.

అదేమిటంది యశో, తరువాత చెప్తా, అని నేనన్నాను. జైలు వార్డెన్ కి  మా ధన్యవాదాలు చెప్పి ముగ్గురం ముస్సోరి ముఖం పట్టాము. 

"ఇంటకీ లఖియా మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు,"  అడిగాను రవిప్రకాష్ ని. 

"చూడడానికి బాగుంది, ప్రస్తుతానికింతే," అన్నాడు.

అతను మమల్ని ఇంటికి  చేర్చేసరికి అనుకోకుండా రాజేంద్ర ఎదో పనిమీద బయటకు వెళ్ళాడు. నేనూహించినట్లే, యశోని హత్తుకుని సరళ  పొందిన ఆనందానికి హద్దులేదు కానీ తను నన్ను కూడా  తన కౌగిల్లో బిగించినప్పుడు నా ఆ శ్చర్యానికి అంతులేదు..

"హనుమంతుని హృదయానికి హత్తుకొని రాముడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి  రామం బాబు," అన్న సరళను నేను నాహృదయానికి హత్తుకోలేకుండా ఉండలేకపోయాను.

"అందుకనే అంటారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని," అంది యశో   సరళ భుజం  మీద చెయ్యివేసి.

"కానీ కొమ్ముల పరిమితి స్వల్ప మాత్రం అయితే చెవుల పరిధి విశాలం కదా  రామం బాబు," అంది సరళ నా కౌగిలి వీడుతూ.

ముస్సోరిలో మరో రెండు రోజులు ఆనందోత్సాహలతో  గడిపి (నలుగురం హాక్ మన్స్ కి కూడా వెళ్ళేం) లఖియా బెయిల్ మీద విడుదలయ్యే సమయానికి వస్తామని కాశీకి యశో నేనూ తిరుగు  టపా కట్టేము.   

        

 

చాప్టర్ 32

 

  

యశో నేనూ, కాశీకి  తిరిగివచ్చి ఒక వారం రోజులై వుంటుంది. ఆనాడు పొద్దున యశో ఓ టెలిగ్రామ్ నాకిచ్చి వెళ్లిపోయింది. అందులో మామయ్యకి చాలా జబ్బుగా వుందనీ తక్షణం బయలుదేరి రమ్మని వుంది. 

మళ్లీ ఒక సమస్య ఎదురైంది. తండ్రి తర్వాత తండ్రిలాంటివాడు బాబయ్య, లలిత పిన్నికీ ఇక మగదిక్కెవ్వరూలేరు. అలాంటి సమయంలో ఆమెకు సహాయం అవసరం, అదీకాక నా వ్యవహారాలన్నీ బాబయ్యే చూస్తున్నాడు. వెళ్లకతప్పదు కానీ యశోని తీసుకుని వెళ్లలేను. ఆ సమయంలో అలాంటిపని చేయడంకంటె తెలివితక్కువ పని ఇంకొకటి వుండదు.

టెలిగ్రాం చేత్తోపట్టుకుని లోపలికి వెళ్లాను. యశో వంటచేయడంలో నిమగ్నురాలైంది.

‘‘యశో నన్నేమి చేయమంటావు?’’ అన్నాను నెమ్మదిగా వెనకనుంచొని.

‘‘చేసేదేముంది చెప్పండి. మీరు తప్పకుండా వెళ్లాలికదా? నన్ను కూడా తీసుగెళ్లాలా లేదా  అన్నదే సమస్య. తీసుగెళ్తే నేను సురేఖను కూడా చూడవచ్చు,’’ అంది చేస్తున్న పని ఆపి నా వైపుతిరిగి.   

‘‘అవును, కాని  నేనొక్కడనే వెళ్లాలి యశో. నిన్ను ఇప్పుడు తీసుకెళ్ల లేను, ’’ అన్నాను.

‘‘అదేమంచిది,’’ అంది యశో గరిటె తిప్పుతూ, అంటే ఆమెకికోపం వచ్చిందన్నమాట.

‘‘చూడు యశో,’’ అని  బుజ్జగించ బోతే  యశో తీవ్రంగా స్పందించి.                           

‘‘నాకు అంతా తెలుసు, మీరే వెళ్లండి, ఆయనకి స్వస్థత కావాలి, మీరు త్వరలో రావాలని ఇక్కడ నుంచే ప్రార్థిస్తూంటాను,’’ అంది నిర్వికారంగా.

ఆ సాయంకాలమే బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. ఒక వైపు కర్తవ్యము, రెండో వైపు యశో ...ఈ రెంటి మధ్యా మనస్సు వూగిసలాడింది, కానీ చేసేదేముంది? యశో తన అంతర్యాన్ని, ఆలోచనని బయటపెట్టలేదు. నేనుకూడా వాటిని రేకెత్తించలేదు. అలా చేస్తే అణచివున్న దు.ఖము విజ్రుంభిస్తుంది. అంతకంటె దానివలన ఎవరికీ ప్రయోజనం లేదు.

రైలు బయలుదేరటానికి ఇంకా టైముంది. ఒకరి చెయ్యి నొకరు

1 ... 9 10 11 12 13 14 15 16 17 18
Go to page:

Free e-book: «క్షంతవ్యులు (Kshantavyulu) by భీమేశ్వర (Bhimeswaea) చల్లా (Challa) (best books to read in life .TXT) 📕»   -   read online now on website american library books (americanlibrarybooks.com)

Comments (0)

There are no comments yet. You can be the first!
Add a comment